11, ఏప్రిల్ 2025, శుక్రవారం

పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే

 కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కౌరవపక్షమున నున్న భీష్మ ద్రోణులను తదితరుల జూచిన అర్జునుడి భావన..........

వారలు నాకు పూజ్యులు ధృవంబు మేలొనగూర్చు వార ల

వ్వారలు నాకు మిత్రులు రవంతయు ద్రోహము చేయబూన ర

య్యారె రణంబు సేయదగునా ! యని చింతిత మానసుండునై 

పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే

7, ఏప్రిల్ 2025, సోమవారం

గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్!

 శల్య సారథ్యము లోని ఘట్టము  ........ ( పరశురాముని శాపముతో శస్త్రాస్త్రములు మరచిపోయిన కర్ణుని గూర్చి )  

కరముల మోడ్చి భక్తిమయ గాత్రముతో స్తుతియించి క్షత్రియ

స్వరమున బీరముల్ వలికి భార్గవు చెంతన జేరి విద్యలన్ 

త్వరితము గాగ నేర్చె సతతంబు నిజంబును దాచివెట్టుచున్

గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్

6, ఏప్రిల్ 2025, ఆదివారం

శ్రీరామనవమి శుభాకాంక్షలు

 శ్రీగురుభ్యోనమః.  

శ్రీరామ నవమి దినమున 

మా రామునకంజలింతు మహి సజ్జన ర

క్షా రాముఁడు ఖల జన శి

క్షా రాముఁడు ధర్మ నిరతి సంరక్షకుఁడున్.   

ఘటమునన్ రాజును గాంచి తెమ్మని బల్కె 

.......... రాజులకు రాజు శ్రీరామమూర్తి 

పాద ఘట్టనముచే పడతి యయ్యెను రాయి 

.......... బాణతాడిత తన్వి స్థాణువయ్యె

ముని వేషుఁడగు రావణుని మోసమున తాను 

......... నిజదార బాసె సన్మునినుతుండు 

ఖగరాజ వాహనుండగు రాజరాజేంద్రు 

.......... డల జటాయు సహాయ మర్థిజేసె 

నౌర వీరప్రతాపాఢ్యుఁడైన రామ 

గుణము లెన్నంగ తరమె భర్గునకునైన

రామ పదయుగ్మమునకంత నామనంబు 

పీఠమై వెల్గు వరమె యీప్సితము నాకు.  

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

11, ఏప్రిల్ 2024, గురువారం

ప్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్

 ఎన్నో ఆవులు / మూగ జీవాలు తినే ఆహారంలో ఈ plastic సంచులు కలిసిపోవడము వలన వాటి ప్రాణములు పోవుచున్నవి.  దీనిని ఉదహరించుచూ...............

సకలంబైన చరాచర వ్రజములో సాఫల్యతా శూన్యమై

వికలంబై బహు జీవరాసులకు నుర్విన్ బ్రాణముల్ తీయు బా

యక యన్నింటను వెంటనుండు విషమై యట్లుండగా నెవ్విధిన్

ప్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్ ?

4, ఏప్రిల్ 2024, గురువారం

2, ఏప్రిల్ 2024, మంగళవారం

పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై

 శ్రితజన బాంధవాళిని విశిష్ట తపోధన మౌని సంఘమున్ 

జిత వివిధానురాగమయ జీవిత చోదక సాధకాళినిన్ 

సతతము రక్షజేసెడి ప్రశస్తిని గాంచుచు దుష్ట దైత్య భూ

పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై